Sunday, February 23, 2025

బిజెపిది తుక్కు సంకల్పం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada AjayKumar comments on Modi

 

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం పువ్వాడ మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది కానీ… తెలంగాణకు వచ్చిందేమీ లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదని యువత ఆశలపై నీళ్లు చల్లారన్నారు. బయ్యారంలో ఉక్కుకు నాణ్యత లేదనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి సంకల్పం లేదని, బిజెపిది తుక్కు సంకల్పమన్నారు. ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. పునర్విభజన చట్టాన్ని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News