ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన అదనపు కలెక్టర్ స్నేహాలతకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా, శిశు కేంద్రంలో జిల్లా ఆదనపు కలెక్టర్ స్నేహ లత ప్రసవ సేవలు పొంది శనివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆదనపు కలెక్టర్ స్నేహాలత ఐఏఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎఎస్ పి శబరిస్ ఐపిఎస్ దంపతులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. జిల్లా ఉప పరిపాలన అధికారి అయినప్పటికీ సామాన్యుల లాగా, ప్రజల్లో ఒక్కరిలా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు పొంది, ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెంచారని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. పేదల గుడి అయిన ప్రభుత్వ ఆసుపత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దారని మంత్రి పువ్వాడ అన్నారు.
Puvvada appreciate additional collector snehalatha