Monday, December 23, 2024

రేవంత్‌ రెడ్డి సవాల్‌పై స్పందించిన మంత్రి పువ్వాడ.. దేనికైనా రెడీ!

- Advertisement -
- Advertisement -

 

Puvvada Ajay Kumar

హైదరాబాద్‌: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సిబిఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు. ‘రేవంత్‌ రెడ్డి ఒక ఐటమ్‌’ అని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. ‘ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడని, సుపారీ ఇచ్చిపిసిసి తెచ్చుకున్నాడని  రేవంత్‌పై మండిపడ్డారు. అలాగే ఈనెల 29 తర్వాత సాయి గణేష్ ఘటనపై మాట్లాడుతానని… కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News