Wednesday, January 22, 2025

తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.10కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనపై వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ తన న్యాయవాది ద్వారా మల్లన్నకు నోటీసులు పంపించారు. ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్, పత్రికలో మంత్రిపై అబద్ధాలు ప్రచురిస్తున్నాడని, అసత్యపు ప్రచారం చేస్తున్నాడని న్యాయవాది నోటీస్ లో పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం తీన్మార్ మల్లన్న మంత్రి పువ్వాడకు రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని, వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో తెలిపారు. వారం రోజుల్లో తీన్మార్ మల్లన్న, మంత్రి పువ్వాడ అజయ్ కి క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు.

Puvvada files rs 10 cr defamation suit against Teenmar Mallanna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News