Monday, December 23, 2024

పివికి భారతరత్న ఇవ్వాలి: తలసాని

- Advertisement -
- Advertisement -

PV Birth Anniversary Celebrations

 

హైదరాబాద్: పివి నరసింహారావు భారతరత్న ఇవ్వాలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పివి 101వ జయంతి సందర్భంగా పివి ఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించిన నాయకుడు పివి అని, పివిని కేంద్రం పట్టించుకోకపోవడం బాధకరమైన విషయం ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్పమేధావి అని కొనియాడారు. ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన పివికి సరైన గుర్తింపులేదన్నారు. గతేడాది పివి జయంతి వేడుకలను సంవత్సరం పొడవునా సిఎం కెసిఆర్ నిర్వహించారని ప్రశంసించారు. నెక్లెస్ రోడ్డుకు పివి మార్గ్‌గా పేరు పెట్టడంతో పాటు భారీ విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పివి భౌతికంగా మన మధ్య లేకపోయిన ఎల్లప్పుడు మన గుండెలో చిరస్థాయిలో నిలిచి పోతారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News