Tuesday, December 24, 2024

పివి ఒక వ్యక్తి కాదు శక్తి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Revanth Reddy reacts on Prashant Kishor to join Congress

 

హైదరాబాద్: భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణమని పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహ రావు జయంతి సందర్భంగా పివి ఘాట్ ను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. భూ సంస్కరణలు తెచ్చి భూమి లేని పేదలకు భూమి ఇచ్చారని,  ప్రపంచ దేశాలలో ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పొందడానికి పివి సరళీకృత విధానాలే కారణమన్నారు. పివిని ప్రతీ ఓక్కరు కీర్తించాల్సిన వ్యక్తి అని, మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధాని గా ఎదగడంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని ప్రశంసించారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా పివి అడుగుజాడల్లో నడిచారని కితాభిచ్చారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందని,  వంగర గ్రామంలో పివి జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని తెలుస్తుందని, వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.  పివి జాతి సంపద అని, వ్యక్తి కాదు ఒక శక్తి అని రేవంత్ కొనియాడారు. పివి కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News