Saturday, December 21, 2024

పివి. సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైబ్రిడ్ వంగాడాల అభివృద్ధిలో కృషికి గుర్తింపు

ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతుకు లాభదాయకం

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతులకు లాభదాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధనాకేంద్రంలో శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. 2021-22 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 8వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (రికార్), నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఎల్) సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ ద్వైవార్షిక జాతీయ అవార్డు కింద్ రూ.2 లక్షల నగదు, బంగారు పతకం ఇచ్చారు.

ఆగస్ట్ 2న డాక్టర్ ఎ.పద్మరాజు అధ్యక్షతన జరిగిన అవార్డు ఎంపిక కమిటీ బి.పి.హెచ్, బి.ఎల్.బి, బ్లాస్ట్, ముంపు, లవణీయతలను నిరోధించే.. సన్నరకం, మొత్తం భారతదేశంలో ప్రభావం చూపిన హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో చేసిన కృషికి డాక్టర్ పి.వి.సత్యనారాయణను ఎంపిక చేసింది. ప్రస్తుతం రాగోలులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ పి.వి.సత్యనారాయణ బెస్ట్ గోల్డెన్ జూబ్లీ ఏఐసీఐపీ సెంటర్ అవార్డు 2015కు టీమ్ లీడర్‌గా జాతీయ అవార్డు, సీడ్ మ్యాన్ అసోసియేషన్ 2021 ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు, బెస్ట్ ఏఐసీటీఐపీ సెంటర్ అవార్డు 2013, ఉత్తమ క్రమశిక్షణ అవార్డు 2014 వంటి అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. ల్యాండ్ మార్క్ వెరైటీగా గుర్తించిన ఎంటీయూ 1010ను అభివృద్ధి చేసిన మొక్కల పెంపకందారులకు గుర్తింపు 2019, క్రాప్ రీసెర్చ్ అవార్డు 2004, రైతుమిత్ర అవార్డు, 2019, రాష్ట్ర పురస్కారం మెరిటోరియస్ రీసెర్చ్ అవార్డు, 2002, నీలకంఠాపురం కావేరప్ప గోల్ మెడల్ 2015, ఉగాది పురస్కారం, 2016, ఈదర సుబ్బాయమ్మ, ఈదర వెంకటరావు స్మారక బంగారు పతకం 2019, ఉత్తమ ఆర్‌ఏఆర్‌ఎస్ అవార్డు 2015, డాక్టర్ ఐవీ సుబ్బారావు స్మారక ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం 2012, ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం 2012, ఉద్దరాజు ఆనందరాజ్ ఫౌండేషన్ అవార్డు 2011, ఉగాది పురస్కారం 2017.  అకాడమీ ఫెలోషిప్ అవార్డు 2014, ఆంధ్రప్రదేశ్ అకడమిక్ ఆఫ్ సైన్సెస్ 2019 కూడా ఆయనను వరించాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఎఆర్) ఆదర్శాలు, లక్ష్యాల ఆధారంగా వ్యవసాయ ప్రయోజనాలను నెరవేర్చడానికి రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (రికారియా) 1997 లో ఏర్పడింది. దాని సభ్యుల అనుభవం సహాయంతో ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యవసాయ సంఘాలతో కలిసి పనిచేస్తుంది. ఐసీఏఆర్ కు చెందిన రిటైర్డ్ సిబ్బంది.. ఈ అసోసియేషన్ శాస్త్రీయ, విస్తరణ సంస్థలకు రిసోర్స్ పర్సన్ల సమూహంగా కూడా సేవలందిస్తోంది. వ్యవసాయ సమాజం, సాధారణ ప్రజలలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధిపై అవగాహన కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ అసోసియేషన్ లో 500 మంది సభ్యులున్నారు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఎల్) భారతదేశంలోని అతిపెద్ద భారతీయ విత్తన కంపెనీ. ఇది మన దేశంలో సుమారు 50 సంవత్సరాలుగా పనిచేస్తోంది.

దాదాపు అన్ని వ్యవసాయ వాతావరణ పరిస్థితులలో దేశవ్యాప్తంగా ఉన్న బ్రీడింగ్ స్టేషన్లలో 30కి పైగా పంటలలో పంట మెరుగుదల ప్రాజెక్టులను ఎన్‌ఎస్‌ఎల్ చేపడుతోంది. ఎన్‌ఎస్‌ఎల్ బ్రీడింగ్ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేసిన రకాలు , సంకరజాతులు వాటి ఔన్నత్యం, అనుకూలతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా వందలాది ట్రయల్ ప్రదేశాలలో బాగా పరీక్షిస్తారు. ఎన్‌ఎస్‌ఎల్ 15 మిలియన్ల మందికి పైగా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎన్‌ఎస్‌ఎల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.2004-2005 సంవత్సరానికి గాను మొదటి ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డును ప్రముఖ పౌల్ట్రీ శాస్త్రవేత్త డాక్టర్ గెండా లాల్ జైన్ కు 2005 అక్టోబరు 27న ప్రదానం చేశారు. తరువాతి ద్వైవార్షిక పురస్కారాలు అందించారు .ఆదివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీఏఆర్ డీజీ, డీఏఆర్‌ఈ కార్యదర్శి డాక్టర్ హిమాన్షు పాఠక్ హాజర్య్యారు. ఈ కార్యక్రమంలో ఇంకా డీఏఆర్‌ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ మాజీ డీజీ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ డాక్టర్ ఈఏ సిద్దిఖ్, ఐసీఏఆర్-ఐఏఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్, ఎన్‌ఎస్‌ఎల్ కంపెనీస్ సీఎండీ ఎం.ప్రభాకరరావు, ఐసీఏఆర్-ఐఏఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌ఎం సుందరం తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్మ్రంలో పాల్గొన్న నూజివీడు సీడ్స్ సీఎండీ ఎం. ప్రభాకర్ రావు మాట్లాడుతూ, “ఈ ్రప్రతిష్టాత్మకమైన అవార్డు ఇప్పటివరకూ 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం ముదావహం అన్నారు. వ్యవసాయంలో మనదేశం అసాధారణ ప్రగతిని సాధించిందన్నారు. కానీ వ్యవసాయరంగానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు చాల అవసరం అన్నారు. ప్రభుత్వాలు ప్రధానంగా వినియోగదారుల కోణం నుంచే చూస్తున్నాయన్నాయేతప్ప , రైతుల కోణం నుంచి చూడటం లేదన్నారు. బియ్యం ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్నా, ఇటీవల కేంద్రం నిషేధం విధించిందన్నారు. ఇక్కడ కావాల్సినన్ని నిల్వలు ఉంచుకుని ఎగుమతులు ప్రోత్సహిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. పత్తిలో హైడెన్సిటీ సాగు విషయంలో ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనివల్ల సాధారణ సాగుకంటే 40శాతం దిగుబడి పెరుగుతుందన్నారు. తగిన యాజమాన్య పద్దతులు పాటిస్తే ఇది 60శాతం వరకూ ఉంటుందన్నారు. రాబోయే ఐదేళ్లలో సత్యనారాయణ చేతుల మీదుగా వచ్చిన వరి రకలలు దేశంలో అత్యధికంగా సాగవుతాయన్న నమ్మకం ఉందన్నారు. రికారియా సభ్యులందరికీ సిల్వర్ జూబ్లీ సందర్భంగాప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News