హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పివి నరసింహారావు 102వ జయంతి సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిపారు. నెక్లెస్ రోడ్డులో పివి జ్ఞానభూమి వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, పివి నరసింహారావు కుమార్తె ఎంఎల్‌సి వాణిదేవి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు సత్యవతి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ శంకర్ నాయక్, ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్, లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ, తదితరలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. పివికి భారతరత్నపై ఇవ్వాలని కేంద్రంతో పోరాడుతామని, పివి చరిత్రలో నిలిచిపోతారన్నారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పివి స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకవచ్చి మార్గదర్శకంగా నిలిచారని తలసాని ప్రశంసించారు.
Also Read: మొసలి దాడిలో రైతు మృతి