Wednesday, January 22, 2025

పివి జయంతి…. నివాళులర్పించిన ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పివి ఘాట్ వద్ద భారత రత్న, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు జరిగాయి. పివి ఘాట్ వద్ద పివి కుమార్తె వాణిదేవి, కుమారుడు ప్రభాకర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కోదండరామ్, హైకోర్టు జడ్జి శ్రావణ్ కుమార్, తదితరలు నివాళులర్పించారు. అసెంబ్లీలో పివి నరసింహరావు చిత్రపటానికి సభాపతి గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో పివి నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్సీ వాణీదేవి, ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీలు పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న దివంగత మాజీ ప్రధాని పి.వి 103 జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో పి వి చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపి వి. హనుమంతరావు, డిసిసి అధ్యక్షులు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగిశెట్టి జగదీష్, అల్లం భాస్కర్, భవాని రెడ్డి, రాపోలు జయ ప్రకాష్, ప్రేమలత అగర్వాల్, లింగం యాదవ్ తదితరులు నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News