Sunday, January 19, 2025

మాజీ ప్రధాని పివి నర్సింహ్మారావు నిజమైన కాంగ్రెస్‌వాది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ మాజీ ప్రధాని పివి నర్సింహ్మారావు నిజమైన కాంగ్రెస్‌వాది ఆయనపై మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధాని పదవి చేపట్టి ఈరెండు పదవులకు వన్నె తెచ్చిన మహానీయుడన్నారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్‌లో చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరడంతో వారి కోరిక మేరకే ప్రభుత్వ లాంచనలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమన్నారు. బిజెపి కుట్రతో ఖమ్మం జిల్లాలో భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని స్వార్ధ పూరిత రాజకీయాల కోసమే సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి గత పాలకులే కారణమన్నారు. ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగా వాట్ల విద్యుత్ పొందే హక్కు ఉందని, 2600 మెట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారన్నారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ తేవడంలో గత ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా చేసింది గడిచిన సర్కారేనని త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన సంఘటనపై విచారణ చేపడుతామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News