Monday, December 23, 2024

పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ప్రతినిధి: భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు దేశానికి చేసిన మరువలేనివని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బుధవారం బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నర్సింహారావు జయంతి ఉత్సవాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకొని దేశానికి తన సేవలను అందించారన్నారు. దేశంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన మహానుభావుడికి తన చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు.

కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పీవీ నర్సింహారావు పట్ల ఉన్న అభిమానంతో వీపీ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ వారి కుటుంబ సభ్యులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించి గౌరవించారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ ఛైర్మన్ బండ ప్రకాష్, పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, విప్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, ఎల్. రమణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News