సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రియాంశు రజావత్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు, పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. అగ్రశ్రేణి ఆటగాడు ప్రణయ్ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా షట్లర్ ఆంథోనీ గింటింగ్‌ను ఓడించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో ప్రణయ్ 1621, 2117, 2114తో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ఆంథోనీ పైచేయి సాధించాడు. అద్భుత ఆటతో ప్రణయ్‌ను హడలెత్తించాడు. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు. కానీ తర్వాత జరిగిన రెండు సెట్లలో ప్రణయ్ పుంజుకున్నాడు. తన మార్క్ ఆటతో ఆంథోనీపై ఆధిపత్యం చెలాయించాడు.
ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రజావత్ విజయం సాధించాడు. భారత్‌కే చెందిన శ్రీకాంత్‌తో జరిగిన మ్యాచ్‌లో రజావత్ అలవోక విజయం అందుకున్నాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రజావత్ 2113, 218 తేడాతో శ్రీకాంత్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రజావత్ ఏదశలోనూ శ్రీకాంత్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత షాట్లతో అలరించిన రజావత్ సునాయాస విజయంతో సెమీస్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగే సెమీస్‌లో భారత్‌కే చెందిన ప్రణయ్‌తో రజావత్ తలపడుతాడు. ఇక మహిళల సింగిల్స్ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు అమెరికాకు చెందిన జాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. దూకుడుగా ఆడిన జాంగ్ 2112, 2117 తేడాతో సింధు ఓడించింది.