పారిస్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగం పోటీ ల్లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, లక్షసేన్‌లు ముందంజ వేశారు. బుధవారం జరిగిన సింగిల్స్ పోటీల్లో సింధు, లక్షసేన్ విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సిం ధు ఎస్తోనియా షట్లర్ క్రిస్టినా కుబాను ఓడించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సిం ధు 215, 2110 తేడాతో జయకేత నం ఎగుర వేసింది. ఆరంభం నుంచే సింధు ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. ఈ క్రమంలో అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో కూడా సింధుకు ఎదురు లేకుండా పోయింది. ఈసారి కూడా క్రిస్టినా కనీస పోటీ ఇవ్వలేక పోయింది. చివరి వరకు దూకుడును కనబరిచిన సింధు అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
లక్షసేన్ కూడా..
మరోవైపు లక్షసేన్ కూడా ముందంజ వేశాడు. బుధవారం జరిగిన సింగిల్స్ పోరులోలక్షసేన్ 2118, 2112 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆగాడు జొనాథన్ క్రిస్టి (ఇండోనేషియా)పై సంచలన విజయం సాధించాడు. తొలి గేమ్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు సేన్ అటు జొనాథన్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. ఒక దశలో సేన్ 28తో వెనుకబడి పోయాడు. అయినా ఒత్తిడికి గురికాకుండా ముందుకు సాగాడు.