- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న తెలుగు తేజాలు స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సాయి ప్రణీత్‌లను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధు తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు పతకాలతో తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు. సింధు, ప్రణీత్‌లు అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతిని ఇనుమడింపచేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి షట్లర్లతో కలిసి స్టేడియంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -