Thursday, January 23, 2025

సెమీస్‌లోనే సింధు ఔట్

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: థాయిలాండ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు ఓటమి పాలైంది. నాలుగో సీడ్ చెన్ యు ఫీ (చైనా)తో జరిగిన పోరులో సింధు పరాజయం చవిచూసింది. 43 నిమిషాల పాటు సాగిన పోరులో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చెన్ 2117, 2116 తేడాతో సింధును ఓడించింది. రెండు సెట్లలోనూ సింధు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇక క్వార్టర్ ఫైనల్లో అగ్రశ్రేణి షట్లర్ అకానె యమగూచిని మట్టికరిపించిన సింధు సెమీస్‌లో మాత్రం జోరును కొనసాగించలేక ఇంటిదారి పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News