Monday, December 23, 2024

క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్..

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్. ప్రణయ్ తదితరులు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రియాంశు రజావత్ కూడా ముందంజ వేశాడు. అయితే మిథున్ మంజునాథ్ మాత్రం ప్రీక్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్‌ను ఓడించింది. ఆకర్షితో జరిగిన పోరులో సింధు అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 2114, 2110 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. అద్భుత ఆటతో అలరించిన సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ అలవోకగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అమెరికా షట్లర్ జాంగ్‌తో సింధు తలపడుతుంది.

ఇక పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు ప్రణయ్ చెమటోడ్చి విజయం సాధించాడు. తైవాన్ షట్లర్ చీతో జరిగిన పోరులో ప్రణయ్ 1921, 2119, 2113తో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ప్రతిపాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో హోరాహోరీ పోరు తప్పలేదు. అయితే తొలి సెట్‌లో చీ పైచేయి సాధించాడు. ప్రణయ్‌ను కంగుతినిపిస్తూ సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో కూడా పోరు ఆసక్తిగానే సాగింది. కానీ ఈసారి ప్రణయ్ చివరి వరకు నిలకడైన ప్రదర్శన చేశాడు. ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేస్తూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ప్రణయ్‌కు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ప్రణయ్ అలవోకగా సెట్‌ను గెలుచుకుని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.

మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ విజయం సాధించాడు. తైవాన్ ఆటగాడు సూతో జరిగిన పోరులో శ్రీకాంత్ 2110, 2117 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే శ్రీకాంత్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా సాగాడు. వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో రజావత్ విజయం సాధించాడు. తైవాన్ ఆటగాడు వాంగ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రజావత్ 2119, 1321, 2119 తేడాతో విజయం సాధించాడు. అయితే భారత షట్లర్లు మంజునాథ్, కె.జార్జ్‌లు ఓటమి పాలయ్యారు. అమెరికా ఆటగాడు లీతో జరిగిన హోరాహోరీ సమరంలో మంజునాథ్ పోరాడి ఓడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News