Monday, December 23, 2024

స్పెయిన్ మాస్టర్స్: క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్

- Advertisement -
- Advertisement -

మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 21-14, 21-16 తేడాతో ఇండోనేషియాకు చెందిన పి.కె.వర్దానిపై విజయం సాధించింది. ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

సింధు ధాటికి వర్దాని కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్లిచ్‌ఫెల్డ్‌తో సింధు తలపడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌ను ఓడించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News