Wednesday, January 22, 2025

వైజాగ్లో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైజాగ్లో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మిస్తున్నారు. గురువారం విశాఖలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేశారు సింధు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. వేగవంతంగా నిర్మాణ పనులు చేసి ఏడాదిలోగా అకాడమీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సింధు తెలిపారు. విశాఖలో బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువత ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె చెప్పారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామని పీవీ సింధు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News