Friday, November 22, 2024

ఫ్రెంచ్ ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి

- Advertisement -
- Advertisement -

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సింధు ఓటమి పాలైంది. జపాన్‌కు చెందిన ప్రపంచ 15వ ర్యాంక్ క్రీడాకారిణి సయాకా తకాశి చేతిలో పరాజయం చవిచూసింది. మూడు సెట్ల హోరాహోరీ పోరులో సింధు 21-18, 16-21, 12-21 తేడాతో కంగుతిన్నది. తొలి గేమ్‌లో సింధు ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థిను హడలెత్తిస్తూ ముందుకు సాగింది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు పెద్దగా శ్రమించకుండానే సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ తర్వాతి సెట్‌లో మాత్రం తీవ్ర ఒత్తిడికి గురైంది. ప్రత్యర్థి దూకుడుగా ఆడడంతో సింధు ఎదురు నిలువలేక పోయింది.

వరుస తప్పిదాలకు పాల్పడుతూ సెట్‌ను కోల్పోయింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లోనూ సింధు తేలిపోయింది. ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. అసాధారణ ఆటతో చెలరేగి సయాకా వరుసగా రెండు గేమ్‌లను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్షంతో బరిలోకి దిగిన సింధు సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఒకప్పుడూ వరుస టైటిల్స్‌తో మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన సింధు కొన్నేళ్లుగా పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. మూడేళ్లుగా ఒక్క టైటిల్‌ను కూడా గెలవలేక పోయింది. దీన్ని బట్టి సింధు ఆట ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

PV Sindhu loses in Semi final in French Open 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News