- Advertisement -
హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధుకు తీవ్ర అన్యాయం జరిగింది. సింధు సర్వీస్ చేసే సమయంలో ఎక్కువగా టైమ్ తీసుకుంటుందనే కారణంతో అంపైర్లు సింధుకు ఒక పాయింట్‌ను పెనాల్టీగా ప్రకటించారు. దీంతో ఆటపై ఏకాగ్రత కోల్పోయిన సింధు మ్యాచ్ ఓడిపోవాలసి వచ్చింది. ఆటలో రెండో గేమ్‌లో స్కోర్లు 14-12తో సింధు లీడ్‌లో ఉన్న సమయంలో అంపైర్లు సింధుకు ఒక పాయింట్‌ను పెనాల్టీగా విధించారు.
PV Sindhu loses semifinals with Penalty Point
- Advertisement -