- Advertisement -
ఒడెన్స్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. కొరియా షట్లర్ అన్ సెయాంగ్‌తో జరిగిన పోరులో సింధుకు పరాజయం ఎదురైంది. ఐదో సీడ్ కొరియా సంచలనం సెయాంగ్ అసాధారణ ఆటతో సింధును చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సెయాంగ్ 2111, 2112 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. భారీ ఆశలతో డెన్మార్క్ ఓపెన్ బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి షట్లర్ పేలవమైన ఆటతో క్వార్టర్స్‌లోనే ఓటమి చవిచూసింది. ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వడంలో కూడా సింధు విఫలం కావడం గమనార్హం. అద్భుత షాట్లతో అలరించిన సెయాంగ్ 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
- Advertisement -