న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పివి సింధూకు ఆంపైర్లు పెనాల్టీ విధించారు. డెన్మార్క్ ఓపెన్‌లో భాగంగా శనివారం స్పెయిన్ క్రీడాకారిణీ కరోలినా మారిన్‌తో జరగిన సెమీస్ పోరులో ఇద్దరూ ఆట మధ్యలో మాటల యుద్ధానికి దిగారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరువురూ ఒకరినొరు నిందించుకున్నారు. ఈ పరిస్థితి సృతిమించి అరుపులు కేకల వరకూ వెళ్లింది. పాయింట్ సాధించిన ప్రతితసారి ఇద్దరూ దురుసుగా ప్రవర్తించారు.
దీంతో ఛైర్ ఆంఫైర్ పలు మార్లు మందలించినప్పటికీ ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. ఇక సింధూ త్వరగా సర్వ్ చేయకపోవడంపై కూడా ఆంపైర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై సిందూను ప్రశ్నిస్తే ’ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా’ అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్ ఇద్దరికీ ’ఎల్లో కార్డు’లు కూడా చూపించాల్సి వచ్చింది. కాగా, 73 నిముషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 18-21, 21-19, 7-21 పాయింట్లతో సింధు ఓటమిపాలైంది.