Monday, December 23, 2024

సింధుకు షాక్..

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మొదటి రౌండ్‌లో సింధు చైనాకు చెందిన జాంగ్ చేతిలో కంగుతిన్నది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన జాంగ్ 21-17, 21-11తో సింధును ఓడించింది. ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే పేలవంగా ఆడింది. ఏ దశలోనూ జాంగ్‌కు గట్టి పోటీ ఇవ్వలేక పోయింది.

మరోవైపు దూకుడుగా ఆడిన జాంగ్ అలవోకగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్లు లక్షసేన్, హెచ్‌ఎస్.ప్రణయ్‌లు ముందంజ వేశారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో సేన్ 21-18, 21-19తో తైవాన్‌కు చెందిన టిసి చౌను ఓడించాడు. మరోవైపు ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో ప్రణయ్ 21-19, 22-20తో తైవాన్‌కే చెందిన వాంగ్‌ను ఓడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News