Monday, December 23, 2024

క్వార్టర్ ఫైనల్లో సింధు

- Advertisement -
- Advertisement -

PV Sindhu reach quarter final

బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు థాయిలాండ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 2116, 2113 తేడాతో కొరియా షట్లర్ సిమ్ యు జిన్‌ను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు అలవోక విజయంతో క్వార్టర్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక క్వార్టర్స్‌లో సింధు చిరకాల ప్రత్యర్థి, వరల్డ్ నంబర్‌వన్ అకానె యమగూచి (జపాన్)తో తలపడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. అతను ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News