మనీలా: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో సింధుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు చైనాకు చెందిన ఐదో సీడ్ బింగ్‌జియోను ఓడించింది. హోరాహోరీగా సాగిన పోరులో సింధు 219, 1321, 2119 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో ఏ మాత్రం ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి చైనా షట్లర్ హవా నడిపించింది. సింధు జోరుకు బ్రేక్ వేస్తూ సెట్‌ను సొంతం చేసుకుది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది.
ఈసారి కూడా ఇద్దరు కూడా సర్వం ఒడ్డి పోరాడారు. అయితే చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన భారత స్టార్ సింధుకు విజయం వరించింది. ఈ గెలుపుతో సింధు సెమీస్‌కు చేరుకుంది. ఇక శనివారం జరిగే సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్)తో తలపడుతోంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన చిరాగ్ షెట్టిసాత్విక్ సాయిరాజ్ జోడీకి చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ ఓటమి పాలైంది. మలేషియాకు చెందిన చియాసో జంట చేతిలో భారత జోడీ పరాజయం చవిచూసింది.