- Advertisement -
న్యూఢిల్లీ: త్వరలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఉబెర్‌కప్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పేర్కొంది. ఈ నెల 8 నుంచి ఉబెర్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సింధు అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో సింధు ఫైనల్‌కు చేరే అవకాశాన్ని తృటిలో చేజార్చుకొంది. కాగా సింధు నిష్క్రమణపై వివాదం నెలకొంది. టోర్నీ నిర్వాహకులపై సింధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలావుండగా తాజాగా సింధు మీడియాతో ముచ్చటిస్తూ తన భవిష్యత్తు ప్రణాళికను వివరించింది. రానున్న ఉబెర్‌కప్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ టోర్నీలో రాణించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది.
- Advertisement -