Monday, December 23, 2024

సింధు, శ్రీకాంత్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు విజయం సాధించింది. అమెరికా షట్లర్ లౌరెన్ లామ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో సింధు, 2119, 1921, 2118 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుకంజలో ఉన్న లౌరెన్‌పై సింధు చెమటోడ్చి నెగ్గడం గమనార్హం. మరోవైపు సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. సౌత్ కొరియా షట్లర్ కిమ్‌తో జరిగిన పోరులో సైనాకు చుక్కెదురైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు శ్రీకాంత్ విజయం సాధించాడు. ఫ్రాన్స్ షట్లర్ బ్రైస్‌తో జరిగిన తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 1821, 2110, 2116తో జయకేతనం ఎగుర వేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News