Monday, December 2, 2024

బ్యాడ్మింటన్ ఛాంపియన్ సింధు..

- Advertisement -
- Advertisement -

 లక్షసేన్, గాయత్రి జోడీలకూ టైటిళ్లు
 సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్
లక్నో: ప్రతిష్ఠాత్మకమైన సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్టర్లు అదరగొట్టారు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పివి సింధు అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చైనాకు చెందిన వు లు యుపై 21-14, 21-16తో వరుస గేమ్‌లలో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో సింధు ఖాతాలో మూడో టైటిల్ వచ్చి చేరింది. అంతకుముందు 2017లో తొలి టైటిల్ నెగ్గిన సింధు.. 2022లో రెండో టైటిల్ సొంతం చేసుకుంది.

ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ఫైనల్‌లో గెలుపొందాడు. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్ తెపై 21-6, 21-7తో సునయాస విజయాన్నందుకొని, తొలిసారి టైటిల్ సాధించాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ట్రిసా జాలి జోడీ అద్భుతం చేసింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో బావొ లి జింగ్‌లి కియాన్(చైనా) జోడిపై 21-18, 21-11 తేడాతో విజయం సాధించింది. గాయత్రి-ట్రీసా జోడీకిది తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం. సయ్యద్ మూడీ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా గాయత్రి జోడీ రికార్డు నెలకొల్పింది. ఈ జోడీ 2022 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News