సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ట్రోఫీ కైవసం
న్యూఢిల్లీ: రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ ఇండియా స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు అదరగొట్టింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైన ల్లో టాప్ సీడ్ సింధు 21-13, 21-16 తేడాతో ఇం డియా యంగ్ స్టర్ మాళవిక బన్సద్‌ను ఓడించింది. 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు జోరు ముందు యువ ప్లేయర్ మాళవిక నిలవలేకపోయింది. 2019 గ్లాస్గో వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్ మెడల్ సాధించి వరల్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత సింధు గెలిచిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. గతేడాది జరిగిన వరల్ టూర్ ఫైనల్స్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. వరల్ చాంపియన్‌షిప్‌లో సింధు క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. సయద్ మోదీ టోర్నీ టైటిల్ గెలవ డం సింధుకు రెండో సారి. 2017లో తొలిసారి ఈ హైదరాబాద్ స్టార్ ఈ టైటిల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో వరల్ నెంబర్ సెవన్ సింధు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది.
లారా లామ్‌తో పా టు థాయ్‌లాండ్ ప్లేయ ర్, ఆరో సీడ్ సుపనిదలను ఓడించి టోర్నీలో ముందడు గు వేసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 21-11తో ఫస్ట్ గేమ్ నెగ్గిన తర్వాత ప్రత్యర్థి ప్లేయర్, ఐదోసీడ్ ఎవ్‌గెనియా(ర ష్యా) రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ నుంచి తప్పుకుంది. దాంతో సింధుకు ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఈ టోర్నీకి ముందు జరిగిన ఇండియా ఓపెన్‌లో సింధు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ఆ ర్నాడ్ మెర్కెల్- లుకాస్ క్లార్‌బౌట్ మధ ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. ఫైనల్ ఆడాల్సిన ఈ ఇద్దరిలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను ఇషాన్ భట్నాగ ర్- తనీషా కాస్ట్రో జోడి గెలుచుకుంది. ఫైనల్లో వీరి జోడి.. నాగేంద్ర- శ్రీవిద్య జోడిని 21-16, 21-12 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.