Thursday, November 14, 2024

వరుస వైఫల్యాలతో సింధు సతమతం

- Advertisement -
- Advertisement -

PV Sindhu with series of failures

ఇక కెరీర్‌లో మరో టైటిల్ సాధించడం కష్టమేనా?

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు కొన్నేళ్లుగా వరుస వైఫల్యాలు చవిచూస్తోంది. కెరీర్ ఆరంభంలో సింధు మహిళల బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఓ వెలుగు వెలిగింది. 2016, 2017లలో సింధు ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ను శాసించిందంటే అతిశయోక్తి కాదు. కొరియా, జపాన్, చైనా, ఇండోనేషియా, తైపీ, డెన్మార్క్, స్పెయిన్ షట్లర్లకు దీటుగా సింధు కూడా వరుస టైటిల్స్‌తో ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర వేసింది.

అయితే ఎప్పుడైతే ఆమెకు స్టార్‌డ్రమ్ మొదలైందో అప్పటి నుంచి ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. రానురాను సింధు ఆట తీసికట్టుగా తయారవుతూ వచ్చింది. ఆటకంటే ఆమె వ్యాపార సంబంధ కార్యకలాపాలపైనే దృష్టి సారించింది. పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా పని చేస్తూ డబ్బు సంపాదనలో నిమగ్నమైంది. సింధు ఆటకంటే దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమె ఆట గాడి తప్పింది. ఒకప్పుడూ ఫైనల్లో ఓడడం అలవాటుగా మార్చుకున్నా సింధు రెండు కొన్నేళ్లుగా కనీసం క్వార్టర్ ఫైనల్ దశ కూడా దాటి ముందుకు వెళ్లడం లేదు. 2016 ఒలింపిక్స్‌లో రతజంతో సహా సింధు మరో రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.

ఇక 2017లో కూడా మూడు టైటిల్స్‌ను గెలుచుకుంది. అంతేగాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత సింధు ఆట తీరు ఒక్క సారిగా మారిపోయింది. పలు టోర్నమెంట్‌లో సింధు కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోయింది. సింధు ఆట తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అపార ప్రతిభా ఉన్నా కూడా సింధు ఆటకంటే వాణిజ్య కార్యకలాపాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని పలువురు మాజీ క్రీడాకారులు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. వరుస ఓటములు ఎదురవుతున్నా సింధు తన ఆట తీరును మెరుగు పరుచుకోవడంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇదే సమయంలో కరోనా కారణంగా సుదీర్ఘ కాలంపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టారు. దీంతో సింధుతో సహా పలువురికి కనీసం సాధన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక 2019లో సింధు తన కెరీర్‌లోనే అత్యుత్తమ విజయాన్ని అందుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.

ఇది తప్పించి సింధు ఖాతాలో ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా లేక పోవడం విశేషం. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఇక ఈసారి వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. 2019లో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ మినహాయిస్తే సింధు మరే టోర్నీలో కూడా విజేతగా నిలువలేక పోయింది. దీన్ని బట్టి సింధు ఆట ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా సింధు తన ఆట తీరును మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాలి. ఇతర విషయాలను పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెడితే కొత్త సంవత్సరంలోనైనా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. లేకుంటే సైనా మాదిరిగానే సింధు పరిస్థితి తయారు కావడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News