- Advertisement -
టోక్యో: ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పివి సింధు కాంస్య పతకం గెలుచుకుంది. చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-13, 21-15 వరసగా రెండు సెట్లలో సింధు పైచేయి సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా రెండో పతకం సాధించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్లో సింధు విజయ దుందుభి మోగించింది. రెండు ఒలింపిక్స్లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
- Advertisement -