Wednesday, December 25, 2024

స్విస్ ఓపెన్ విజేత సింధు

- Advertisement -
- Advertisement -

ఫైనల్లో ప్రణయ్ ఓటమి

బ్రాసెల్ : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో థాయిలాండ్‌కు చెందిన బుసానన్‌పై 16-21, 8-21 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు బుసానన్‌కు అవకాశమివ్వకుండా ఆధిపత్యం చెలాయింది. కాగా, ఈ ఏడాదిలో సింధుకు ఇది రెండో సూపర్ 300 టైటిల్. ఏడాది ప్రారంభంలో జనవరిలో జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్న సివంధు ఇక ఈ స్విస్ ఓపెన్‌కు ముందు గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో సింధు సెమీస్ వరకు వెళ్లి ఓటమి పాలైంది. ఆ టోర్నీ సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ పోర్న్‌పావీ చోచువాంగ్ చేతి లో 17-21, 9-21 తేడాతో పరాజయం పాలైంది. ఇక మార్చి మొదటి వారంలో జర్మన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లోనే సింధు వెనుదిరిగి తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. చైనాకు చెందిన ఝాంగ్‌యి మాన్ చేతిలో 14-21 21-15 14-21 తేడాతో సింధు ఓటమి పాలైం ది. ఇదిలా ఉండగా ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు నిరాశ ఎదురైంది. ఇం డోనేసియాకు చెందిన క్రిస్టో చేతిలో 12-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News