Sunday, January 19, 2025

పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం… బస్సును ఢీకొట్టిన ఆటో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు రోడ్డు  ప్రమాదాల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మైలార్ దేవ్ పల్లిలోని పల్లె చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కూరగాయాల ఆటో ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇదరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జు నుజ్జుగా మారింది. ఆటో శంషాబాద్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొని చంద్రయాణగుట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఆటో డ్రైవర్ నిద్ర మత్తులో బస్సును ఢీకొట్టినట్టు సమాచారం.

రాజేంద్రనగర్ లోని పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 294 ఫిష్ బిల్డింగ్ వద్ద కారు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి టాక్సీ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జుగా మారాయి. తృటిలో ప్లైఓవర్ పైనుంచి కింద పడే ప్రమాదం నుంచి బాధితులు బయటపడ్డారు. పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి మెహదీపట్నం రూట్ ను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News