Thursday, January 23, 2025

రూ.699 కే పది సినిమాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సినిమా ప్రేమికులకు ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ శుభవార్త చెప్పింది. పివిఆర్ ఐనాక్స్ పాస్‌పోర్టు పేరిట మంత్లీ పాస్‌ను తీసుకువచ్చింది. సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఈ పాస్‌ను తీసుకువచ్చింది. ఈ నెల 16నుంచి ఈ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.699 చెల్లించి మంత్లీ పాస్ తీసుకుంటే నెలలో పది సినిమాలు చూడవచ్చు. అయితే సోమవారంనుంచి గురువారం వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.చాలా మంది సినిమాలను థియేటర్లలో చూడడమే ఇష్టమని చెబుతున్నా..థియేటర్లకు మాత్రం రావడం లేదని పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ సిఇఓ గౌతమ్ దత్తా ఈ సందర్భంగా పేర్కొన్నారు. పఠాన్,సలార్, జవాన్,లియో వంటి పెద్ద సినిమాలు మొబైల్ ఫోన్లకు రావాలంటే చాలా వారాలు పడుతుందని,చెప్పారు. అయితే థియేటర్లలో వీక్షించాలనుకున్నా ప్రేక్షకులు ఖర్చుకు వెనకాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

ఇది ఇండస్ట్రీకి ఎంతమాత్రం మంచిది కాదని, పైగా చిన్న సినిమాలకు దీనివల్ల నష్టం కలుగుతుందన్నారు.అందుకే ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడానికి ఈ మంత్లీ ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ మల్టీప్లెక్స్‌లలో ఫుడ్, శీతల పానీయాల ధరలను 40 శాతం తగ్గించినట్లు చెప్పారు. నెలలో రెండు మూడుపార్లు వీక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెడితే వీక్షణలు పెరిగి మరిన్ని సినిమాలు వస్తాయన్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పివిఆర్ ఐనాక్స్ యాప్, వెబ్‌సౌట్‌నుంచి కనీసం 3 నెలలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సినిమా బుకింగ్ సమయంలో పేమెంట్ ఆప్షన్‌లో పాస్‌పోర్టు కూపన్‌ను ఉపయోగించుకోవాలి.ఒక వేళ ఒకటికంటే ఎక్కువ టికెట్లు బుక్ చేయాల్సి వస్తే ఒక టికెట్‌కు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది.ఇది సింగిల్ యూజర్‌కు వర్తిస్తుంది. వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలుండదు. థియేటర్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని ఐపివిఆర్ ఐనాక్స్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News