Friday, November 22, 2024

కొత్తగా 4 స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్..

- Advertisement -
- Advertisement -

దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రీమియం సినిమా ప్రదర్శన కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX), తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్‌లో నేడు కొత్త 4-స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించామని ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా విద్యానగర కాలనీలోని జీవన్ రెడ్డి మాల్ & మల్టీప్లెక్స్‌లోని ఈ కొత్త స్ర్కీన్‌లు రాష్ట్రంలో పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX)కు 19వ ప్రాపర్టీ కాగా, తెలంగాణంలో 106 స్క్రీన్‌లతో కంపెనీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో 94 ప్రాపర్టీలలో 523 స్క్రీన్‌లతో సంస్థ తన ఉనికిని ఏకీకృతం చేసింది.

తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా, నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటిగా ఆర్మూర్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ మల్టీప్లెక్స్‌లో 1254 మంది ప్రేక్షకుల సీటింగ్ కెపాసిటీని, 2కె ప్రొజెక్టర్‌లు, నెక్స్ట్-జెన్ 3డీ స్క్రీన్‌లు మరియు డాల్బీ అట్మాస్ సౌండ్‌తో సహా అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీలను కలిగి ఉంది.

కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభ నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ మాట్లాడుతూ, “వైవిధ్యమైన లాంగ్వేజ్ బేస్, హై మూవీ గోయింగ్ ఇండెక్స్‌తో, మా వృద్ధి ప్రయాణంలో దక్షిణాది మార్కెట్ ఎల్లప్పుడూ మమ్మల్ని ఆకర్షిస్తోంది. మా పోర్ట్‌ఫోలియోలో పీవీఆర్, ఐనాక్స్ (INOX) విలీనంతో దక్షిణాదిలో మా ఉనికిని విస్తరించేందుకు మేము సంతోషిస్తున్నాము. దేశంలోని కొత్త నగరాలు, పట్టణాలకు ఆధునిక మల్టీప్లెక్స్ అనుభవాన్ని తీసుకెళ్లే మా వ్యూహంలో భాగంగా తెలంగాణలోని ఆర్మూర్‌లో మా కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాము. దేశంలో వినియోగదారుల స్థోమత, యాక్సెసిబిలిటీ, పరిమిత లొకేషన్-బేస్డ్ లీజర్ యాక్టివిటీస్ కారణంగా సినిమా అనేది ఇంటి వెలుపలి వినోద ఎంపికగా మొదటి స్థానంలో ఉంది’’ అని తెలిపారు.

ఈ ప్రాపర్టీ సమకాలీన శైలిలో అద్భుతమైన ఆర్ట్‌ వర్క్ గోడలు, ప్లాస్మాలతో అద్భుతంగా రూపొందించారు. ఇది వివేకం కలిగిన ప్రేక్షకులకు అధునాతనమైన, శక్తివంతమైన అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా, ఫోయర్ స్పేస్‌లో కోవ్ లైట్లు, క్రిస్టల్ షాన్డిలియర్స్‌తో థీమ్ ఆడిటోరియంలలో ఎరుపు రంగు ఆత్మీయతతో స్వాగతించే వాతావరణాన్ని అందిస్తుంది.

దీని ప్రారంభోత్సవం సందర్భంలో పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ మాట్లాడుతూ, ‘‘పీవీఆర్ ఎల్లప్పుడూ మన దేశం చూస్తున్న సమీకృత రిటెయిల్ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటుంది. మేము నిరంతరం కొత్త డెవలపర్లతో భాగస్వామ్యం కోసం చూస్తున్నాము. చిన్న పట్టణాలు, నగరాలలో (Tier-2 and Tier-3 cities) మాల్స్ ప్రారంభించడం, ఈ నగరాల్లో మా విస్తరణ ఈ లోతైన పాదముద్ర విస్తరించేందుకు సహాయపడుతుంది. విస్తారమైన శ్రామిక జనాభా అందించిన జీవనశైలిని మెరుగుపరుచుకోవడంతో, చలనచిత్రం కూడా మరింత ఆకాంక్షాత్మకంగా మారాలి. తెలంగాణలో యువ జనాభా ఉంది. సినిమా ప్రేక్షకులకు సంబంధించిన ప్రధాన జనాభా విభాగాలలో ఒకటి. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము’’ అన్నారు.

దీని ప్రారంభంతో పీవీఆర్ ఐనాక్స్ తన వృద్ధి వేగాన్ని బలోపేతం చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 24 నగరాల్లోని 30 ప్రాపర్టీలలో 168 స్క్రీన్‌లను ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News