- Advertisement -
న్యూఢిల్లీ: మల్లీప్లెక్స్‌ల దిగ్గజం పివిఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నాలుగో త్రైమాసికంలో రూ. 333 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంత క్రితం ఏడాది(202122)లో రూ. 105 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకుంది. కాగా పివిఆర్, ఐనాక్స్ విలీనం అయ్యాయి. రెండు సంస్థలూ కలిసి గత ఏడాది 168 కొత్త స్క్రీన్లను ఆవిష్కరించాయి. ఇదిలావుండగా తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పివిఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
- Advertisement -