Sunday, January 19, 2025

టీచర్‌పై ప్రైవేట్ స్కూలు యజమాని అత్యాచారం

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ నోయిడా: ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థినిపై ఆ పాఠశాల యజమాని అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

పాఠశాల ప్రాంగణంలో ఫిబ్రవరిలో మొదటిసారి తనపై పాఠశాల యజమాని తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత టీచర్ ఆరోపించారు. దీన్ని వీడియో రికార్డింగ్ చేసిన నిందితుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.

ముఖ్యమైన పని ఉందని సాఠశాలోని తన కార్యాలయానికి పిలిపించిన యజమాని తనపై అక్కడే అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. ఇటీవలే తన ఆవేదనను ఆమె తన భర్తకు చెప్పగా పోలీసులను ఆశ్రయించాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. గతవారం సెక్టార్ బేటా 2 పోటీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెప్టెబర్ 29న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మంగళవారం పాఠశాల యజమానిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News