Sunday, December 22, 2024

హైటెన్షన్ వైర్లపైకి ఎక్కిన కొండచిలువ

- Advertisement -
- Advertisement -

Python climbs on high tension wires in Rangareddy

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో శుక్రవారం కొండచిలువ కలకలం సృష్టించింది. పోలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం నుంచి కొండ చిలువ తీగలపైకి ఎక్కింది. అశ్చర్యానికి గురైన స్థానిక రైతులు ఆటవీశాఖ, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తమైన సిబ్బంది, హైటెన్షన్ వైర్ల కావడంతో జాగ్రత్త పడ్డారు. తాళ్ల సాయంతో కొండ చిలువను కిందపడేశారు. కిందపడ్డ కొండ చిలువను అధికారులు సమీప ఆటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండ చిలువ సమీప అటవీ ప్రాంతం నుంచి పోలంలోకి వచ్చి వైర్లపై పాకుతూ వెళ్లినట్లు అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News