Wednesday, January 22, 2025

హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హిమాయత్ సాగర్ క్రస్ట్ గేటు వద్ద భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద  ఇరుక్కున్న కొండ చిలువను జల మండలి సిబ్బంది గుర్తించి స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ సొసైటీ సభ్యుడు నడుముకు తాడు కట్టుకొని దైర్యంగా క్రస్ట్ గేటుకు చేరుకొని కొండ చిలువను నోటితో పట్టుకొని పైకి తీసుకొచ్చాడు. క్రస్ట్ గేటు వద్ద కొండచిలువ ఇరుక్కొని నరక యాతన అనుభవించిందని స్నేక్ సొసైటీ సభ్యుడు తెలిపాడు. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువను స్నేక్ సొసైటీ సభ్యులు కాపాడటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. కొండచిలువను కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News