- Advertisement -
మన తెలంగాణా/జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని ఓ రైతుకు చెందిన పత్తి చేనులో సంచరిస్తున్న కొండ చిలువను హతం చేసిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం అతని పత్తి చేనులో పత్తి తీసేందుకు కూలీలను పురమాయించాడు. ఇంతలో పత్తి చేనులో సంచరిస్తున్న కొండ చిలువ కూలీల కంటపడింది.
దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. రైతుకు సమాచారం ఇవ్వగా అతడు వచ్చి దానిని హతమార్చాడు. ఇప్పటికే ఇక్కడ ఎలుగుబంట్లు, చిరుత సంచారంతో భయపడుతున్న జనాలు కొండచిలువ రావడంతో ఇంకా భయబ్రాంతులకు గురయ్యారు. చుట్టూ పక్కల గుట్టలు, చెట్లు ఉండడంతో వన్యప్రాణులు వ్యవసాయ క్షేత్రాల్లో సంచరిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే వాటి నుంచి రక్షించుకోవచ్చని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -