Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో ‘క్యూ ఫీవర్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త రకం జ్వరం ‘క్యూ ఫీవర్’ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ప్రజలు కబేళాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్‌లో 250 మంది మాంసం విక్రయించే వారికి వైద్య పరీక్షలు చేయగా, ఐదుగురిలో ‘క్యూ ఫీవర్’ గుర్తించినట్లు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్(ఎన్‌ఆర్‌సిఎం) నిర్ధారించింది.

ఈ ‘క్యూ ఫీవర్’ అనేది మేకలు, గొర్రెలు, పశువుల నుంచి సంక్రమించే అంటు వ్యాధి. ఇది జంతువుల్లో కనిపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి గాలి ద్వారా కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంది. క్యూ ఫీవర్‌తో బాధపడే వ్యక్తులకు జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పితో పాటు ఫ్లూ వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వ్యాధి కొద్ది మందికే సోకింది. దీని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పరిశుభ్రత పాటించాలి. ఈ వ్యాధి మొదట పశుకాపారులకు వచ్చి తర్వాత ఇతరులకు వ్యాపించే అవకాశాలుంటాయి.

Q fever

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News