Saturday, November 23, 2024

నాలుగో త్రైమాసికంలో తగ్గిన కరెంట్ ఖాతా లోటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం(2022-23) నాలుగో త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వెల్లడించింది. ఆర్‌బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రధానంగా వాణిజ్య అంతరంలో తగ్గుదల, సేవల ఎగుమతుల్లో పెరుగుదల వల్ల కరెంట్ ఖాతా లోటు తగ్గింది. 202223 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 1.3 బిలియన్ డాలర్లు (రూ.10,400 కోట్లు), అంటే జిడిపిలో 0.2 శాతానికి తగ్గింది. ఇది అంతకుముందు అక్టోబర్‌డిసెంబర్ త్రైమాసికంలో 16.8 బిలియన్ డాలర్లు (జిడిపిలో 2 శాతం) ఉంది.

అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ లోటు 13.4 బిలియన్ డాలర్లుగా ఉంది. త్రైమాసికానికి కరెంట్ ఖాతా లోటు తగ్గడానికి వాణిజ్య లోటు తగ్గడమే కారణమని ఆర్‌బిఐ పేర్కొంది. మూడో త్రైమాసికంలో 71.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు నాలుగో త్రైమాసికంలో 52.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. వాణిజ్య లోటు పెరుగుదల కారణంగా కరెంట్ ఖాతా లోటు 2022-23లో జిడిపిలో 2 శాతానికి పెరిగింది. అయితే 2021-22లో కరెంట్ ఖాతా బ్యాలెన్స్‌లో 1.2 శాతం లోటు ఉంది. 2022-23లో 265.3 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది, ఇది 2021-22లో 189.5 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు, దీని కారణంగా కరెంట్ ఖాతా లోటు పెరిగింది.

ఆర్‌బిఐ డేటా ప్రకారం, 2022-23లో కరెంట్ ఖాతా లోటు 67 బిలియన్ డాలర్లు, ఇది 2021-22లో 38.7 బిలియన్ డాలర్లుగా ఉంది. డేటా ప్రకారం, నాలుగో త్రైమాసికంలో నికర విదేశీ పెట్టుబడులు 6.4 బిలియన్ డాలర్లు, ఇది మూడో త్రైమాసికంలో 2 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ ఏడాది క్రితం 13.8 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా నమోదైంది. అదే సమయంలో 2022-23లో ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో 28 బిలియన్ డాలర్లు, ఇది 2021-22లో 38.6 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది.

2022-23 నాలుగో త్రైమాసికంలో స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నుండి 1.7 బిలియన్ డాలర్ల ప్రవాహం ఉంది. ఏడాది క్రితం 15.2 బిలియన్ డాలర్ల ప్రవాహం కనిపించింది. జనవరి నుండి మార్చి వరకు ఉన్న నాలుగో త్రైమాసికంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల నుండి 28.6 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు వచ్చాయి, ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 20.8 శాతం పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News