Wednesday, January 22, 2025

ఖతార్ వాసికి వరుసగా రెండోసారి లక్కీ లాటరీ

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అబూదాబిలో ఖతార్‌లో నివసించే ప్రవాస భారతీయుడు ఒకరు ఫిబ్రవరి 4న జరిగిన బిగ్ టిక్కెట్ వీక్లీ డ్రాలో రెండవసారి భారీ బహుమతి లభించింది. అబు దాబి వాసి సుమన్ ముత్తయ్య నాడార్ రాఘవన్ గత శనివారం జరిగిన కార్ రాఫెల్ డ్రాలో రేంజ్ రోవర్‌ను గెలుచుకున్నారు. 2022 డిసెంబర్‌లో జరిగిన వీక్లీ ఎలెక్ట్రానిక్ డ్రాలో రాఘవన్ ఒక కేజీ 24 క్యారెట్ బంగారాన్ని గెలుచుకున్నారు. గడచిన ఏడాది కాలంగా తాను ప్రతివారం లాటరీ టిక్కెట్లు కొంటున్నానని అతను చెప్పాడు.

మార్చి 3వ తేదీన జరగనున్న తదుపరి లాటరీ డ్రాలో లక్కీ విజేతకు 15 మిలియన్ దినారాలు(రూ. 33,69,28,073) మొవదటి బహుమతిగా లభిస్తాయి. రెండవ బహుమతి కింద ఒక మిలియన్ దినారాలు(రూ. 2,24,61,871), మూడవ బహుమతిగా 1 లక్ష దినారాలు(రూ. 22,46,071), నాలుగవ బహుమతిగా 50.000 దినారాలు(రూ. 11,23,035) లభిస్తాయి. టికెకట్లను ఆన్‌లైన్‌లో బిగ్ టిక్కెట్ వెబ్‌సైట్‌లో కాని అబు దాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News