Friday, September 27, 2024

అమెరికా వీసా మినహాయింపు పొందిన తొలి అరబ్ దేశం ఖతార్!

- Advertisement -
- Advertisement -

దోహా:  ఖతార్ అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ వీసా మినహాయింపు ప్రోగ్రామ్ జాబితాలో చేరిన రెండవ మధ్యప్రాచ్య దేశం, మొదటి అరబ్ దేశం. ఖతార్ మధ్యప్రాచ్య రెండో దేశం అయితే, ఇజ్రాయెల్ మొదటి దేశం. వీసా లేకుండా 90 రోజుల వరకు యునైటెడ్ స్టేట్స్‌ ను సందర్శించడానికి ఖతార్ దేశంలోని పౌరులను అనుమతిస్తుంది.

అమెరికా డిపార్ట్‌మెంట్స్ ఆఫ్ స్టేట్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం (సెప్టెంబర్ 24న) ఈ ప్రకటనను చేసింది. తక్కువ వీసాల తిరస్కరణ రేట్లు, దేశంలోకి ప్రయాణికులకు అమెరికా వీసా రహిత ప్రవేశం కల్పించడంతో సహా ప్రోగ్రామ్‌లోని అన్ని నిబంధనలు, షరతులకు ఖతార్ కట్టుబడి ఉండనుంది. ఈ ప్రోగ్రామ్‌లోకి ఖతార్ ను అంగీకరించడం వల్ల వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం నుండి ఇప్పటికే ప్రయోజనం పొందిన 41 ఇతర దేశాల జాబితాలోకి ఆ దేశం చేరింది.

యునైటెడ్ స్టేట్స్ వీసా మినహాయింపు కార్యక్రమం డిసెంబర్ 1, 2024 నాటికి ఖతార్ జాతీయుల కోసం అధికారికంగా అమలులోకి వస్తుంది. రెండవది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీసా మాఫీ వ్యవధిని అక్టోబర్ 1, 2024 నుండి 30 నుండి 90 రోజులకు పెంచబోతుంది. తద్వారా ద్వైపాక్షిక పర్యాటకానికి ఊతం ఇవ్వనున్నది.

ఖతర్ దేశస్థులు 12.5 బిలియన్ అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెడితే వీసా ఫ్రీ ట్రావెల్ మినహాయింపును యునైటెడ్ కింగ్డమ్ ఇదివరకే ఇచ్చింది. ఇప్పుడు అమెరికా కూడా ఖతర్ దేశస్థులకు వీసా ఫ్రీ ట్రావెల్ అవకాశాన్ని కల్పించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News