Friday, December 27, 2024

గూఢచర్యం కేసులో అరెస్టైన భారత మాజీ నేవీ అధికారులను విడుదల చేసిన ఖతార్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: జైల్లో మగ్గుతున్న ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులను ఖతార్ కోర్టు విడుదల చేసింది. వీరిలో ఏడుగురు  సోమవారం తెల్లవారుజామను భారత్‌కు తిరిగొచ్చారు. దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8మంది భారత మాజీ నౌకదళ అధికారులను గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 2022 అక్టోబర్ లో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తర్వాత వీరికి ఖతార్ కోర్డు మరణశిక్ష కూడా విధించింది.

ఈ క్రమంలో వారిని రక్షించమని కోరుతూ.. అధికారుల కుటుంబ సభ్యులు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో రంగంలోకి దిగిన భారత్.. చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని విడిపించేందుకు ఖతార్ కోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ క్రమంలో ఖతార్ కోర్టు.. వారికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదు విధించింది. తాజాగా వారిని విడుదల చేసింది. దీంతో ఈరోజు ఏడుగురు ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోడీ వల్లే ఇది సాధ్యమైందని.. ఇవాళ మేము తిరిగి ఇండియాకు రాగలిగామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News