హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించేందుకు, డిజిటల్ వినియోగం పెంపునకు వీలుగా ఆటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్స్ (ఎటివిఎమ్)లో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా టికెట్ పొందే వీలు కల్పించారు. ఈ నూతన సౌకర్య విధానంలో ఎటివిఎమ్‌లో ప్రయాణ వివరాలు నమోదు చేశాక.. టికెట్ ఛార్జీ చెల్లింపునకు ప్రస్తుత ఆప్షన్లకు అదనంగా పేటీఎం ద్వారా యూపిఐ , ఫ్రీ ఛార్జి మరో రెండు ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ఎటివిఎమ్ స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు టికెట్ చార్జీ చెల్లించవచ్చు.. పేమెంట్ చెల్లింపు విజయవంతంగా పూర్తి అయిన తర్వాత నిర్ణీత టికెట్ మెషిన్ ద్వారా లభిస్తుంది. అన్ రిజర్వ్, ప్లాట్‌ఫారం టికెట్లు కొనుగులు చేసే వినియోగదారులకు ఎటివిఎమ్‌లు ప్రయోజనంగా ఉండనున్నాయి. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ కోరారు.
మరింత సులువుగా రైల్వే టిక్కెట్లు కొనుగోలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -