Monday, December 23, 2024

రాముడి పేరిట చందాల దందా

- Advertisement -
- Advertisement -

స్కాన్ /పే స్కామ్‌పై విహెచ్‌పి హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశవిదేశాల్లోని శ్రీరామ భక్తులకు హిందూ సంస్థలు ఆన్‌లైన్ చందాల దందాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. జనవరిలో బ్రహ్మండమైన రీతిలో అయోధ్యలో శ్రీరామాలయ ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఈ దశలో కొందరు సైబర్ దొంగలు బయలుదేరారు. ఆలయానికి విరాళాలు దండిగా అందిస్తే వారికి రాముడి దయ ఉంటుందని తెలియచేస్తూ తమ వంతుగా విరాళాలు భారీగా పంపించాలని కోరుతూ , దీనికి తోడుగా క్యూర్ కోడ్ సందేశాలు కూడా వెలువరిస్తున్నారు. ప్రజలు ఈ కోడ్‌ను వాడుకుని చందాలు పంపిస్తే తాము స్వీకరించి రామాలయ ధర్మకర్తల మండలికి పంపిస్తామని సామాజిక మాధ్యమాలలో తెలియచేస్తున్నారు.

ఈ విషయం విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) ఇతర సంస్థల దృష్టికి వచ్చింది. దీనితో ఈ సంస్థల ప్రతినిధులు తక్షణం స్పందించారు. ఇటువంటి స్కాన్ పే మాయాజాలంలో పడొద్దని, వీటిపై స్పందించవద్దని హెచ్చరించారు. రామాలయ నిర్మాణం సంపూర్తి అయింది. ఇక మిగిలింది కేవలం ఆలయ ప్రారంభోత్సవం. ఇది జనవరిలో జరుగుతుంది. ఇప్పుడు వెలువడుతున్న ప్రకటనలు సైబర్‌మోసగాళ్ల స్కామ్‌లో భాగం అని, వీటిని నమ్మి డబ్బులు పంపిస్తే అవి నేరుగా ఈ దొంగల, మోసగాళ్ల జేబుల్లోకి పోతుందని తెలిపారు. రాముడి ఉత్సవానికి రాగల్గిన వారు రాగలరు. లేదా దూరం నుంచే ఇళ్లలో ఉండి ఆరంభం దశలో జ్యోతి వెలిగించండని పలుపు నిచ్చారు. చందాల స్వీకరణ దశ ముగిసింది. ఇప్పుడు డబ్బులు స్వీకరిస్తామనే మాటలకు లొంగిపోవద్దని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News