Wednesday, December 25, 2024

అట్టడుగున మన వర్శిటీలు

- Advertisement -
- Advertisement -

QS World University Rankings

క్యూయస్ సంస్థ చొరవతో అకడమిక్ రెప్యుటేషన్, ఎంప్లాయర్ రెప్యుటేషన్, ఫాకల్టీ- స్టూడెంట్ నిష్పత్తి, ఫాకల్టీ సైటేషన్, ఇంటర్నేషనల్ ఫాకల్టీ నిష్పత్తి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ నిష్పత్తి ఆధారంగా ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకులు నిర్ణయించి ప్రకటించారు. 19వ క్యూయస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ -2023లో 1,418 యూనివర్సిటీలకు చెందిన 51 డిసిప్లైన్స్‌లో జాబితాను తాజాగా విడుదల చేయబడింది. వెయ్యి అత్యుత్తమ ప్రపంచ యూనివర్సిటీల జాబితాలో 27 యూనివర్సిటీలు మాత్రమే ఇండియాకు చెందినవి ఉన్నాయి. ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో 2021లో 29, 2022లో 35 ఇండియన్ యూనివర్సిటీలు స్థానం దక్కించుకోగా, 2023లో 41 యూనివర్సిటీలు జాబితాలో చోటు పొందడం కొంత ఊరటను కలిగిస్తున్నది.

ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీగా మ్యాచెస్టిస్యూట్స్ (యంఐటి)-యుయస్ తొలి స్థానంలో నిలువగా 2వ ర్యాంకులో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, 3వ ర్యాంకులో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, 4వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, 5వ స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, 6వ స్థానంలో కాలిఫోల్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ /లండన్ ఇంపీరియల్ కాలేజ్, 8వ స్థానంలో యుసియల్-యుకె, 9వ స్థానంలో ఇటిహెచ్ జూరిచ్, 10వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలు తొలి 10 ర్యాంకులు దక్కించుతున్నాయి. 2022 ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో 35 ఇండియన్ యూనివర్సిటీలు ఉండగా 2023 జాబితాలో 41 యూనివర్సిటీలు చోటు దక్కించుకోవడం సంతోషదాయకమనే చెప్పాలి. అత్యుత్తమ ఇండియన్ యూనివర్సిటీల్లో 155వ స్థానంలో ఐఐయస్‌సి -బెంగళూరు ఉండగా, 172వ స్థానంలో ఐఐటి ముంబై, 174వ స్థానంలో ఐఐటి ఢిల్లీ, 250వ స్థానంలో ఐఐటి మద్రాస్, 264వ స్థానంలో ఐఐటి కాన్పూర్, 270వ స్థానంలో ఐఐటి ఖరగ్‌పూర్‌లు 300 లోపు ర్యాంకులను ఆక్రమించాయి. 369వ ర్యాంకులో ఐఐటి రూర్కీ, 384వ ర్యాంకులో ఐఐటి గౌహతి, 396వ ర్యాంకులో ఐఐటి ఇండోర్‌లు ఉన్నాయి. తొలి 500 యూనివర్సిటీల జాబితాలో ఇండియాకు చెందిన యూనివర్సిటీలు 09 మాత్రమే (ఐఐయస్‌సితో పాటు 8 ఐఐటిలు) ఉండడం గమనించాలి.

501-700 మధ్య ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, సావిత్రిభాయి ఫూలే పుణె యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, అన్నా యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, జెయన్‌యు-ఢిల్లీ, ఐఐటి బిహెచ్‌యు వారణాసి, ఒపి జిండాల్ గ్లోబల్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. 701-1000 మధ్య ర్యాంకుల్లో ర్యాంకులో జాదవ్‌పూర్ యూనివర్సిటీ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, చండీగఢ్ యూనివర్సిటీ, ఐఐటి భువనేశ్వర్, జామియా మిలియన్ ఇస్లామియా -ఢిల్లీ, యన్‌ఐటి తిరుచురాపల్లి, పాండిచ్చరి యూనివర్సిటీ, శూలిని యూనివర్సిటీ – సోలన్, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా చోటు దక్కించుకున్నాయి. 1001 -1200 లోపు ర్యాంకుల్లో అలిఘర్ ముస్లిమ్ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాలయం, బిహెచ్‌యు- వారణాసి, బిట్స్ పిలాని, సత్యభామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- చెన్నై, శిక్షా ఓ అనుసంధాన్ డీమ్డ్ యూనివర్సిటీ, తాపర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ- పటియాలా, యూనివర్సిటీ ఆఫ్ బాంబె, వెల్లుర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు తమ స్థానాలను ఆక్రమించాయి. 1201-1400ల లోపు ర్యాంకులు సాధించిన భారత సంస్థల్లో జామియా హమ్దర్ద్-ఢిల్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, యస్‌ఆర్‌యం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు మన చోటును సుస్థిరం చేసుకున్నాయి.

సైటేషన్ పర్ ఫాకల్టీ (సిపియఫ్) విశ్లేషణ ప్రకారం అత్యుత్తమ పరిశోధన సంస్థగా 100/100 స్కోర్‌తో ఐఐయస్‌సి-బెంగళూరు తొలి స్థానంలో నిలువగా 37వ స్థానంలో ఐఐటి గౌహతి, 47 వ స్థానంలో ఐఐటి రూర్కి, 48వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్రికా మద్రాస్‌లు ఉత్తమ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్‌గా 50 లోపు ర్యాంకులు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 1,418 అత్యున్నత యూనివర్సిటీల జాబితాలో తెలంగాణకు చెందిన ఐఐటి హైదరాబాదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీలు మాత్రమే చోటు దక్కించుకోవడం సోచనీయం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూనివర్సిటీలు ఒక్కటి కూడా చోటు దక్కించుకోకపోవడం విచారకరం.అత్యుత్తమ గ్లోబల్ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్న 41 భారతీయ సంస్థల్లో గత ఏడాది జాబితాతో పోల్చితే 12 సంస్థలు తమ స్థానాలను మెరుగు పరుచుకోగా, 12 సంస్థలు స్థిరంగా ఉండడం, 10 సంస్థల స్కోర్లు తగ్గడం, 07 కొత్త సంస్థలు జాబితాలో చోటు దక్కించుకోవడం గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా 1,418 యూనివర్సిటీల్లో భారత్‌కు చెందినవి 41 మాత్రమే ఉండడం విచారకరమే అయినా రానున్న రోజుల్లో నాణ్యత ప్రమాణాలను పెంచుకుంటూ తొలి 100 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో ఇండియన్ సంస్థలు చోటు దక్కించుకోవాలని ఆశిద్దాం.

* బుర్ర మధుసూదన్ రెడ్డి- 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News