Monday, December 23, 2024

నూతన ఔట్‌లెట్‌ను ప్రారంభించిన క్యుఎస్‌ఆర్‌ ఛైన్‌ ఫ్యాట్‌ టైగర్‌

- Advertisement -
- Advertisement -

QSR Chain Fat Tiger Opens new outlet in Hyderabad

హైదరాబాద్‌: క్విక్‌ రెస్టారెంట్‌ చైన్‌ ఫ్యాట్‌ టైగర్‌ ఇటీవలనే తమ నాల్గవ ఫ్రాంచైజీ ఓన్డ్‌ రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ స్టోర్‌ 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్‌ నెంబర్‌ 3–5–908/101, పూజా మానర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిమాయత్‌ నగర్‌ వద్ద ఉంది. యువత, ఫ్యామిలీలు, విద్యార్థులు మరియు పాన్‌ ఆసియన్‌ క్యుసిన్‌ను ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని అందించే రీతిలో ఇది ఉంటుంది. ఈ సంస్థ తమ మూడు ఔట్‌లెట్లను బంజారాహిల్స్‌, సైనిక్‌పురి, కుందన్‌భాగ్‌ల వద్ద ఏర్పాటుచేసింది. ఫ్యాట్‌ టైగర్‌ అనేది ఆధునిక క్యుఎస్‌ఆర్‌, కేఫ్‌ ఛైన్‌. ఇక్కడ మోములు, బర్జర్లు , పిజ్జాలు, డ్రింక్‌లు మరియు మరెన్నో లభిస్తాయి. ఫ్యాట్‌ టైగర్‌ వద్ద అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన టీ, బేవరేజస్‌తో పాటుగా నైపుణ్యవంతంగా తీర్చిదిద్దిన మోములు మరియు మరెన్నో ఉన్నాయి, వీటితో పాటుగా పోషకాహార భోజనాలు కూడా లభిప్తాయి.

ఈ సంస్థ ఇప్పుడు విస్తరణ పథంలో ఉంది. ప్రస్తుతం 22 నగరాలలో 50 ఔట్‌లెట్లు ఉండగా, రాబోయే మూడేళ్లలో వీటి సంఖ్యను 200కు చేర్చనున్నారు. ఫ్యాట్‌ టైగర్‌ కో–ఫౌండర్స్‌, డైరెక్టర్లు శ్రీ సహజ్‌ చోప్రా మరియు శ్రీ సాహిల్‌ ఆర్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో తమ నాల్గవ ఔట్‌లెట్‌ తెరువడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నగరంలో తమను సాదరంగా ఆహ్వానించారు. ఈ నూతన స్టోర్‌ను సైతం మా వినియోగదారులు అదే రీతిలో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామన్నారు.ఫ్యాట్‌ టైగర్‌ వద్ద తాము కుటుంబమంతటినీ ఆకట్టుకునే రీతలో మోమోలను తయారుచేయనున్నామని, అలాగే ప్రత్యేకమోనూను సైతం సృష్టించబోత్నుట్లు తెలిపారు.

QSR Chain Fat Tiger Opens new outlet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News