నల్గొండ : నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేంద్రంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని ఆయన స్పష్టం చేశారు. అందుకు విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయుల శ్రమ కారణమని ఆయన చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలలో బాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన విద్యాదినోత్సవం సంబరాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మా ట్లాడుతూ సర్కార్ బళ్లకు పెరుగుతున్న సంఖ్యనే ప్రభుత్వ పాఠశాలల పనితీరును ప్రతిబింబింప చేస్తుందన్నారు.2014 కు పూర్వం డ్రాప్ ఔట్స్ పెరిగిన అంశాన్ని ప్రవైట్ పాఠశాలకున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. అటువంటి దుస్థితి నుండి ప్రభుత్వ పాఠశాలలలోనే క్యాలిటీ, క్యాలి ఫికేషన్లు ఉన్నారన్నా అంశాన్ని తల్లి తండ్రులు గుర్తించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో సాధించిన మార్పుకు సంకేతమన్నారు.
అటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది విరివిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సర్కార్ చదువు అంటేనే విముఖత చూపించిన దుస్థితి నుండి సర్కార్ చదువులకై పోటీలు పడుతున్న మార్పును యావత్ తెలంగాణా సమాజం గమనించాలని ఆయన ఉద్బోధించారు. ఒక్క నల్లగొండ జిల్లాలోని 23,000 మంది విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు ఆయన వివరించారు. ఇదంతా మనమంతా కష్టపడినందున విద్యారంగంలో సాధించిన అభివృద్ధి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. ప్రైవేటు పాఠశాలల్లో ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా టీచర్లు పనిచేస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు, క్వాలిఫై టీచర్లు, అన్ని వసతులు వసతులతో కూడిన తరగతి గదులు ఉన్నట్లు ఆయన తెలిపారు. మన పిల్లలు బాగుండాలంటే బడి బాగుండాలి టీచర్లు బా గుండాలి అన్నారు.
ప్రాథమిక దశలో ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిదవ తరగతిలో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సరిగా చెప్పక విద్యార్థులు చదువును మధ్యలోనే మానేసేవారని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో వచ్చిన పదవ తరగతి, ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదివిన విద్యార్థులకే టాప్ ర్యాంకులు వచ్చాయని ఆయన తెలిపారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే సరైన విద్యా వస్తుందని తల్లిదండ్రులు భ్రమలను విడనాడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఆయన కోరారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. స్టాల్స్‌లో ఏర్పాటుచేసిన స్టడీ మెటీరియల్, ఇతర పరికరాలను అందరు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నందున ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.
అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ ల స మస్య ఉన్నది. అది కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతుంది దానిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. విద్య ర ంగంలోనే కాక వ్యవసాయ,మంచి నీటి,కరెంట్,ఇతర విషయాల్లో ఎంతో అభివృద్ధి, ప్రగతి సాధించామని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్య అందించే లనే లక్ష్యంతో మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకువచ్చారని ఆయన తెలిపారు. విద్యారంగంలో సమూల మార్పులు తెస్తున్నాం అన్నారు.
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృ ష్ణారెడ్డి మాట్లాడుతూ, గతంలో జిల్లాలో 2 లక్షల 19 వేల మంది విద్యార్థులు ఉంటే నేడు రెండు లక్షల 40 వేల 600 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. 2014 తర్వాత మన ఊరు మనబడి కార్యక్రమం కింద 517 పాఠశాలలను ఎంపిక చేసి 174.61 కోట్ల అంచనా తో పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి నియోజకవర్గం రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, టీచింగ్ విధానాన్ని సులభతరం చేసి విద్యార్థులకు బోధన తొలిమెట్టు తీసుకున్నది. రన్నింగ్ మెటీరియల్ను పంపిణీ చేస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా రీడింగ్ కోసం పాఠశాలల్లోనే 152 గ్రంథాలయాలను ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
127 హైస్కూల్లో డిజిటల్ క్లాసులు ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మధ్యాహ్న భోజన విషయంలో అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే కోడి గుడ్డును అందజేసేవారు. కానీ నేడు పౌష్టికాహారం అందరి విద్యార్థులకు అందాలే అనే సంకల్పంతో ప్రతిరోజు కోడిగుడ్డును అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు నుండి ప్రతి పాఠశాలలో రాగిజావని కూడా పంపిణి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్,గొర్రెల,మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా,ఉన్నత విద్య మండలి సభ్యులు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.